HNK: రోడ్డుపై దొరికిన డబ్బును పోలీసులకు అందించి ఇద్దరు చిన్నారులు తమ నిజాయితీని చాటుకున్నారు. ఈ ఘటన HNK నగరంలోని పెగడపల్లి డబ్బాలు జంక్షన్ సమీపంలో బుధవారం జరిగింది. పూజిత, లిథివిక్ అనే ఇద్దరు చిన్నారులు స్కూల్కు వెళ్తున్న క్రమంలో వారికి రోడ్డుపై రూ. 400 దొరికాయి. డబ్బులు తీసుకున్న చిన్నారులు పక్కనే ఉన్న పోలీసులకు ఆ డబ్బులు అందించి నిజాయితీని చాటుకున్నారు.