MLG: ములుగులో డయల్ యువర్ డీఎంకు విశేష స్పందన లభించింది. మొత్తం పదిమంది కాల్ చేశారని డీఎం రవిచందర్ తెలిపారు. ములుగు మండలం పొట్లాపూర్కు అదనంగా ట్రిప్పు పెంచాలని కోరినట్లు తెలిపారు. గట్టమ్మ దేవాలయం వద్ద బస్సు ఆపడం లేదని ఓ ప్రయాణికుడు ఫిర్యాదు చేశాడు. పలు రూట్లలో బస్సులను టైంకి ఆపరేట్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. త్వరలో ఈ సమస్యలన్నింటినీ పరిష్కారం చేస్తామని డీఎం స్పష్టం చేశారు.