WGL: జిల్లా స్థాయి ఆర్చరీ పోటీల్లో మెరుగైన ప్రతిభ కనబరిచి పర్వతగిరి మండలం కల్లెడ ఆర్డీఎఫ్ అకాడమీకి చెందిన బాలురు, బాలికలు రాష్ట్ర స్థాయి పోటీలకు బుధవారం ఎంపికయ్యారు. మొత్తం 38 మంది పాల్గొన్న ఈ పోటీల్లో శర్వన్, బాబా షర్ఫుద్దీన్, రఫీకా, స్వరూప తదితరులు అర్హత సాధించారు. హైదరాబాదులో ఈనెల 7–9 తేదీల్లో పోటీలు జరుగనున్నాయి. ఎంపికైన వారిని అధికారులు అభినందించారు.