VZM: అర్హులందరికీ ఇళ్ల స్థలాలు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం అధికారులతో వీసీ నిర్వహించారు. ఇళ్ల స్థలాల కోసం పేర్లు నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం ఈ నెల 14 వరకు గడువు ఇచ్చిందని, ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేసి తప్పనిసరిగా నమోదు చేయించాలని సూచించారు.