NGKL: తిమ్మాజిపేట మండలం మరికల్ గ్రామంలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ పత్రాల పరిశీలన పకడ్బందీగా జరపాలని ఎంపీడీవో రాజ్యలక్ష్మి అధికారులను ఆదేశించారు. బుధవారం మరికల్ క్లస్టర్‌ను సందర్శించి, పరిశీలన తీరును ఆమె అడిగి తెలుసుకున్నారు. నామినేషన్ పత్రాలలో ఏవైనా లోపాలు ఉంటే వాటిని తిరస్కరించాలని రిటర్నింగ్ ఆఫీసర్ సత్యనారాయణకు సూచించారు.