W.G: ఈ నెల 6, 7 తేదీల్లో కడపలో జరగనున్న సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ 9వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆ పార్టీ నాయకులు టి. అప్పలస్వామి పిలుపునిచ్చారు. తణుకు మండలం దువ్వ గ్రామంలో బుధవారం పార్టీ మహాసభల కరపత్రాలను నాయకులు ఆవిష్కరించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంపద సృష్టి, సంక్షేమం తెస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని ఆయన విమర్శించారు.