RR: మన్సురాబాద్ డివిజన్లో వీధి కుక్కల దాడిలో గాయపడిన ప్రేమ్ చంద్ అనే బాలుడు నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి బాలుడిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ, వెటర్నరీ శాఖ అధికారులు 24 గంటలు పర్యవేక్షణ చేపట్టేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.