KMR: కలెక్టరేట్లో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం కార్యక్రమంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, సివిల్ జడ్జ్ నాగరాణి పాల్గొన్నారు. దివ్యాంగుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పింఛన్ల, లోన్ల వంటి పథకాలను వివరించారు. ఈ ఏడాది స్కూటీలు, లాప్టాప్లు, ట్రైసైకిళ్లు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. 28 మందికి లోన్లు, 15 మందికి వివాహ ప్రోత్సాహకంగా రూ.15 లక్షలు మంజూరు చేశారు.