కృష్ణా: పెడన మండలంలోని 12వ వార్డు బంగ్లా పాఠశాలలో స్థాపితమైన దివ్యాంగ విద్యార్థుల భవిత ప్రత్యేక విద్యా కేంద్రంలో బుధవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు పలు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. దివ్యాంగ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడం, వారి ప్రతిభను వెలికితీయడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మండల విద్యాశాఖ అధికారి సలోమి తెలిపారు.