ADB: పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నార్నూర్, గాదిగూడ మండలాల్లోని గ్రామపంచాయతీ స్థానాలకు సంబంధిత సర్పంచ్ సీట్లన్నీ కైవసం చేసుకోవడమే ధ్యేయమని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. ఆమె బుధవారం నార్నూర్ మండలంలోని గుంజాల గ్రామంలో నిర్వహించిన కాంగ్రెస్ విజయోత్సవ సభకు హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులనే గెలిపించాలని ప్రచారం చేశారు.