TG: రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ కుముదిని ఎమ్మెల్సీ కవిత కలిశారు. సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా.. సీఎం అధికారిక కార్యక్రమాలతో ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజాధనంతో కాంగ్రెస్ పార్టీకి మేలు చేకూర్చేలా సీఎం జిల్లాల పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు.