TG: కరీంనగర్లో ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకే సోనియమ్మ తెలంగాణ ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. 2001లో ఈ ప్రాంతం నుంచే ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిందని అన్నారు. యువతకు ఉద్యోగాలు రావాలని శ్రీకాంతాచారి ఇవాళ్టి రోజునే బలిదానం చేసుకున్నాడని గుర్తుచేశారు. తమ ప్రభుత్వం రెండేళ్లలో 60 వేల ఉద్యోగులు ఇచ్చిందని.. 6 నెలల్లో మరో 40 వేల ఉద్యోగాలు ఇస్తామని తెలిపారు.