ADB: సమష్టిగా సమన్వయంతో కేసులను పరిష్కరించి కక్షిదారులకు సత్వర న్యాయం అందించటానికి కృషి చేద్దామని జూనియర్ సివిల్ జడ్జీలుగా బాధ్యతలు చేపట్టిన దివ్యవాణి, తేజస్విని పేర్కొన్నారు. ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన న్యాయవాదుల పరిచయ కార్యక్రమంలో వారు మాట్లాడారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి న్యాయవాదులు సైతం సహకరించాలని కోరారు.