MHBD: బీజేపీ పార్టీ తరుపున కురవి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నిమ్మశెట్టి సత్యం నియమింపబడ్డాడు. ఈ మేరకు గ్రామ బీజేపీ నాయకులు ఆయనను సర్పంచ్ అభ్యర్థిగా నిలబెడుతూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. జిల్లా, మండల, గ్రామ బీజేపీ నాయకులు, ప్రజల ఆశీర్వాదంతో తాను సర్పంచ్‌గా గెలుస్తానని సత్యం ధీమా వ్యక్తం చేశారు. గ్రామస్తులు ఆశీర్వదించాలని కోరారు.