MDK: చిన్నశంకరంపేట మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల స్క్రూటినీ కార్యక్రమం కొనసాగుతోంది. మండలంలోని గ్రామ పంచాయతీలకు గాను 250 మంది సర్పంచ్ అభ్యర్థులు, 680 మంది వార్డు సభ్యుల అభ్యర్థులు నామినేషన్ వేశారు. నామినేషన్ల పరిశీలన పూర్తి కాగానే సరైన అభ్యర్థులను ప్రకటించనున్నారు.