TG: ఐదేళ్లలో ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బహిరంగ సభలో మాట్లాడిన ఆయన.. ఐదేళ్లలో 17లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చామని చెప్పారు. పేదల కోసం రేషన్ కార్డుపై సన్నబియ్యం ఇస్తున్నామన్నారు.