KNR: కరీంనగర్ అంధుల పాఠశాల విద్యార్థిని సింధుశ్రీతో కలిసి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పాట పాడారు. నేడు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని దివ్యాంగులలో స్ఫూర్తి నింపేందుకు కలెక్టర్ ఈపాటను యూట్యూబ్ పోస్ట్ చేసారు. సినీ గేయ రచయిత చంద్రబోస్ 2009లో విడుదలైన నింగినేల నాదే.. అనే సినిమా కోసం రాసిన “ఆరాటం ముందు ఆటంకం ఎంత?” అనే పాటను పాడారు.