దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (102) సూపర్ సెంచరీ చేశాడు. ఈ క్రమంలోనే వన్డేల్లో 52వ, అంతర్జాతీయ కెరీర్లో ఓవరాల్గా 83వ శతకం నమోదు చేశాడు. అలాగే, వన్డేల్లో అత్యధికంగా 13 వేర్వేరు సందర్భాల్లో వరుసగా మూడు, అంతకంటే ఎక్కువసార్లు 50 ప్లస్ స్కోర్లు సాధించిన ఏకైక ఆటగాడిగా కోహ్లీ ప్రపంచ రికార్డు సాధించాడు.