W.G: అత్తిలి మండలం స్కిన్నేరపురం లోని ‘రైతన్న మీకోసం’ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ JC మాట్లాడుతూ.. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వ్యవసాయ కార్యచరణ ప్రణాళికకు సంబంధించి రైతులతో మాట్లాడారు. వ్యవసాయంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందే విధంగా జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు.