NLG: ప్రాథమిక స్థాయి విద్య పిల్లల భవిష్యత్తుకు మొదటి అడుగు అని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం ఆమె త్రిపురారం మండల కేంద్రంలో మినీ గురుకులం గిరిజన బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల తరగతి గదులు, మధ్యాహ్న భోజనం, హాస్టల్ సౌకర్యాలు పరిశీలించి బాలికలకు అందిస్తున్న సేవలపై ఉపాధ్యాయులతో చర్చించారు.