VKB: బొంరాస్ పేట మండలం మెట్లకుంటలో వరి, కంది పంటలను వరి పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు బుధవారం పరిశీలించారు. రైతులు నాణ్యమైన విత్తనాలను తీసుకెళ్లి పంటలను సాగు చేసి ఆదాయం వచ్చేలా కార్యాచరణ చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి పోలప్ప, సీనియర్ సైంటిస్టు భారతి, ఏఈవో స్వాతి తదితరులు పాల్గొన్నారు.