BDK: రాష్ట్ర సాధన కోసం కేవలం 25 సంవత్సరాల వయస్సులోనే తన ప్రాణాలను అర్పించి అమరుడైన మహానుభావుడు కాసోజు శ్రీకాంతాచారి వర్ధంతి ఇవాళ అశ్వరావుపేటలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శ్రీకాంతాచారి చరిత్రలో మరువని వీరుడు అని కొనియాడారు.