SRD: హుస్నాబాద్‌లో ప్రజా పాలన–ప్రజా విజయోత్సవాల సభలో సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇందిరమ్మ ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భాన్ని ఆయన సంతోషంగా పేర్కొన్నారు. ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీని గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానించినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర కలను సోనియాగాంధీ నెరవేర్చినట్టు వెల్లడించారు.