పార్లమెంటు సాక్షిగా జిహాద్‌పై ఎస్పీ ఎంపీ మొహిబ్జుల్లా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ముస్లింలపై ఇలాగే అణచివేత కొనసాగితే జిహాద్ చేయాల్సి రావచ్చన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. రాజ్యాంగం, అంబేద్కర్ సూత్రాలను అఖిలేష్ యాదవ్ పార్టీ నేరుగా దాడి చేస్తుందని ధ్వజమెత్తింది. ఈ వ్యాఖ్యలతో ఆ పార్టీ జిహాద్‌ను చట్టబద్ధం చేస్తోందా? అని ప్రశ్నించింది.