AP: సూపర్ సిక్స్.. సూపర్ హిట్ అయ్యిందని సీఎం చంద్రబాబు అన్నారు. రైతుల సమస్యలపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ‘రైతన్నకు అండగా ఉంటామనేది మా మొదటి నినాదం. నీటి వనరులు పెంచేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాం. విద్యుత్ ఛార్జీలను పెంచేది లేదని మరోసారి స్పష్టం చేస్తున్నా. ఛార్జీలను పెంచకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తాం’ అని సీఎం వెల్లడించారు.