ELR: పెదపాడు మండలం అప్పనవీడు సమీపంలో గల కొత్త రేమల్లె మండల పరిషత్ మోడల్ ప్రైమరీ పాఠశాలకు, పదివేల రూపాయల విలువ గల సామాగ్రిని గ్రామానికి చెందిన తుమ్మల పూర్ణచందర్రావు వితరణగా అందించారు. ఈ మేరకు పాఠశాల హెచ్.ఎం. వెలమర్తి రవిబాబుకు బుధవారం అందజేశారు. పూర్ణచందర్రావు మాట్లాడుతూ.. గ్రామం మరియు పాఠశాల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని అన్నారు.