NZB: దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. ప్రభుత్వ తోడ్పాటును సద్వినియోగం చేసుకుంటూ అన్ని రంగాల్లో విజయం సాధించాలన్నారు. జిల్లా మహిళా శిశు దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు నిర్వహించారు.