KMM: నామినేషన్ సందర్బంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాటు చేసిన పోలీస్ బందోబస్తుతో నిశితంగా పర్యవేక్షించాలని కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ పోలీస్ అధికారులకు సూచించారు. తల్లాడ గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని బుధవారం ఏసీపీ వసుంధర యాదవ్ సందర్శించారు. ప్రతి ఒక్కరు ఎన్నికల ప్రవర్తన నియమావళి తప్పకుండా పాటించాలని పేర్కొన్నారు.