WGL: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య బుధవారం ఢిల్లీలో కలిశారు. సీఎం రేవంత్ రెడ్డి, సహచర ఎంపీలతో కలిసి కావ్య ప్రధానితో సమావేశమయ్యారు. తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్‌కు రావాలని ఈ సందర్భంగా వారు మోదీని ఆహ్వానించారు. అనంతరం వరంగల్ పార్లమెంటు పరిధిలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ఎంపీ ప్రధానికి వివరించారు.