GNTR: తాడికొండ పోలీస్ స్టేషన్ను ఎస్పీ వకుల్ జిందల్ మంగళవారం వార్షిక తనిఖీ చేశారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. విలేజ్ అడాప్టెడ్ కానిస్టేబుళ్లు, మహిళా పోలీసుల ద్వారా క్షేత్రస్థాయి సమాచారం సేకరించాలన్నారు. సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టులు, గంజాయిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. రౌడీషీటర్లపై నిఘా ఉంచాలన్నారు.