HR88B888 అనే రిజిస్ట్రేషన్ నెంబర్ను హిసార్కు చెందిన వ్యక్తి రూ.1.17 కోట్లకు దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే గడువులోగా ఆ మొత్తాన్ని చెల్లించడంలో అతను విఫలంకావడంతో దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. రూ.1.17 కోట్లను అతను చెల్లించగలడా? అతనికి ఆర్థిక స్తోమత ఉందా? అతని ఆదాయమెంతా? అనేది నిర్థారించాలని హర్యానా మంత్రి అనిల్ తెలిపారు.