WGL: పర్వతగిరి మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం బుధవారం విస్తృత పరిశీలనలు చేపట్టింది. తురకల సోమారం క్రాస్ రోడ్, పర్వతగిరి చౌరస్తా పరిసరాల్లో వాహనాలను ఆపి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు దేవకచరణ్, అనిల్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.