MDCL: ఉప్పల్ సర్కిల్ -2 పరిధిలో రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ జోరుగా సాగుతూనే ఉంది. సర్కిల్ పరిధిలో ఉప్పల్, కాప్రా, మల్కాజ్గిరి, అల్వాల్ మున్సిపల్ సర్కిల్ ప్రాంతాలు ఉన్నాయి. ఆయా పరిధిలో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య 2.25 లక్షలకు చేరుకున్నట్లుగా పౌరసరఫరాల అధికారులు తెలిపారు. కేవలం గత 7 నెలలలోనే కొత్తగా 45 వేల రేషన్ కార్డులు మంజూరయ్యాయి.