అన్నమయ్య: మదనపల్లె మండలంలో ఆదివారం వెలుగు చూసిన ఘటనలో, పాలెంకొండలో అర్ధరాత్రి గొర్రెలు దొంగలిస్తుండగా యజమానులు ఓ దొంగను పట్టుకున్నారు. రామసముద్రం మండలం, చంబకూరుకు చెందిన దొంగలు గొర్రెల మందలో చొరబడగా, యజమానులు వారిని పట్టుకుని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం ఆ దొంగను తాలూకా పోలీసులకు అప్పగించారు.