ATP: గుత్తి మహర్షి దయానంద గురుకులంలో శుక్రవారం ముందస్తు సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. గురుకుల ఆవరణలో సామూహిక గొబ్బిళ్ళు, చిన్నారులకు బోగి పండ్లు పోయడం వంటి కార్యక్రమాలను ఉత్సాహంగా నిర్వహించారు. చిన్నారులు సాంప్రదాయ వస్త్రధారణలో గొబ్బెమ్మల పాటలు పాడుతూ సందడి చేశారు.