KRNL: పెద్దకడబూరు పోలీస్‌స్టేషన్ రాష్ట్రంలోనే అత్యుత్తమ పోలీస్‌స్టేషన్‌గా ఎంపికైంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించిన 2026 సర్టిఫికెట్ ఆఫ్ ఎక్సలెన్సీ అవార్డును శుక్రవారం మంగళగిరిలోని రాష్ట్ర డీజీపీ హారిష్ కుమార్ గుప్తా ఐపీఎస్ చేతుల మీదుగా రాష్ట్ర పోలీసులు అందుకున్నారు. నేర నియంత్రణ, వేగవంతమైన దర్యాప్తు, సీసీ కెమెరాల వినియోగం, టెక్నాలజీ ఆధారితంగా ఈ అవార్డు దక్కింది.