SKLM: మందస మండలంలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 18వ విడత సామాజిక తనిఖీ సమన్వయ సమావేశం శుక్రవారం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో నిర్వహించారు. మందస మండలంలో ఉపాధి హామీ పనులకు సంబంధించి వేతనాలు రూ.31.44 కోట్లు, మెటీరియల్ రూ.18.27 కోట్లతో పనులు జరిగినట్లు తెలిపారు. ఇందులో ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ శ్రీదేవి, మందస ఎంపీడీవో వై వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.