NDL: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం క్షేత్రంలో ఇవాళ జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ సునీల్, అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో భక్తులు స్వామివారిని దర్శించుకునేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు.