WGL: వర్ధన్నపేట మండలం కట్ర్యాల గ్రామంలోని శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఏర్పాట్లను కొందరు కాంగ్రెస్ నాయకులు అడ్డుకుంటున్నారని శుక్రవారం బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరాములు ఆరోపించారు. జాతర ఏర్పాట్లలో భాగంగా దేవాలయానికి సున్నం వేయడానికి వెళ్లిన కమిటీ సభ్యులను పోలీసులు బెదిరించారని, రాజకీయ జోక్యంతో భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని తెలిపారు.