E.G: సంక్రాంతి వేళ అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ నర్సింహ కిషోర్ వెల్లడించారు. భద్రతలో భాగంగా డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచినట్లు తెలిపారు. నేర నియంత్రణకు పోలీస్ బృందాలు గ్రామాల్లో పర్యటిస్తూ స్థానికులకు అవగాహన కల్పిస్తున్నాయని చెప్పారు. పండుగ పూట ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టినట్లు ఎస్పీ స్పష్టం చేశారు.