BHPL: జిల్లా కేంద్రంలోని సెయింట్ పీటర్స్ హైస్కూల్ ప్రాంగాణంలో ఆదివారం ట్రినిటీ ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు. ఈ మీట్‌కు ముఖ్యఅతిథిగా MLA గండ్ర సత్యనారాయణ రావు హాజరై మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని అన్నారు. చదువు జ్ఞానం ఇస్తే, క్రీడలు శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందిస్తాయని పేర్కొన్నారు.