ADB: ఈనెల 18 నుంచి 25 వరకు నాగోబా జాతర నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా ఆలయంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ITDA పీఓ యువరాజ్ మర్మాట్లకు ఆలయ కమిటి సభ్యులు ఆహ్వాన పత్రిక అందజేసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కమిటీ ఛైర్మన్ మెస్రం ఆనంద్ రావు, సభ్యులు దేవురావు, వెంకట్ రావు, తుకారాం సర్పంచ్ మెస్రం శేకు, పూజారి, తదితరులు పాల్గొన్నారు.