GNTR: పొన్నూరులోని తుంగభద్ర బ్రిడ్జిపై తాగునీటి పైప్లైన్ లీకవడంతో వేల లీటర్ల నీరు రోడ్డుపాలవుతోంది. గంటల తరబడి నీరు వృథాగా పోతుండటంతో అటు మున్సిపాలిటీకి నష్టం వాటిల్లడమే కాక, ఆ ప్రాంతమంతా అపరిశుభ్రంగా మారుతోంది. తాత్కాలిక మరమ్మతులతో కాలక్షేపం చేయకుండా, అధికారులు వెంటనే స్పందించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.