TG: కీసరలో తెల్లవారుజామున దొడ్ల మిల్క్ మేనేజర్ శ్రీనివాస్‌పై కిరణ్ అనే పాల వ్యాపారి కత్తితో దాడి చేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శ్రీనివాస్‌ను హైదరాబాద్‌లోని శ్రీకర ఆస్పత్రికి తరలించారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. పాల వ్యాపారి కిరణ్ కొంతకాలంగా పాల వ్యాపారం చేస్తూ దొడ్ల కంపెనీకి బకాయి ఉన్నట్లు తెలుస్తోంది.