కృష్ణా: బాపట్ల(D) చీరాలలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి మృతి ఘటన కలకలం రేపింది. కృష్ణా(D) పోరంకికి చెందిన హర్షిత్ అక్కడి ప్రైవేట్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. వేటపాలెం(M)చల్లారెడ్డిపాలెంలో నివసించే స్నేహితుల గదిలో గడుపుతూ.. బుధవారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన మిత్రులు వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.