నేచురల్ స్టార్ నాని లైనప్లో మరో ఆసక్తికర చిత్రం చేరనుంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ సోషియో ఫాంటసీ మూవీకి నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. దీనికి ‘గౌరీ తనయ’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. కార్తికేయుడి పౌరాణిక అంశాలతో సాగే ఈ చిత్రం.. నాని కెరీర్లో తొలి సోషియో ఫాంటసీ మూవీ కానుంది. ప్రస్తుతం నాని ‘ది ప్యారడైజ్’, ‘బ్లడీ రోమియో’ చిత్రాలతో బిజీగా ఉన్నాడు.