MDK: కౌడిపల్లి మండల కేంద్రంలోని 132 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లో మరమ్మతుల పనులు చేపడుతున్న నేపథ్యంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని ఏఈ యాదగిరి, ఏఈఈ సాయికుమార్ వెల్లడించారు. ఈ మరమ్మతుల కారణంగా కౌడిపల్లి, కాంచనపల్లి, వెల్మకన్నె, వెంకట్రావుపేట సబ్స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో ఇవాళ మధ్యాహ్నం 3 గం.ల నుంచి సా. 5 గంటల వరకు విద్యుత్ నిలిపివేత ఉంటుందని తెలిపారు.