TPT: SP సుబ్బారాయుడు ఆదేశాలతో తిరుపతి నగరంలో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 58 మందిపై పోలీసులు కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున మొత్తం రూ.5.80 లక్షల జరిమానా విధించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లాలో కఠిన తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీస్ శాఖ తెలిపారు.