AP: CM చంద్రబాబు అధ్యక్షతన ఈ ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది. ఈ సందర్భంగా రాజధాని ప్రాంతంలో పలు సంస్థలకు భూ కేటాయింపులపై నిర్ణయం తీసుకోనుంది. అలాగే SIPB ఆమోదించిన రూ.19,391 కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అటు రాజధానిలో రోడ్డు మూలల్లో ఉన్న 112 ఫ్లాట్లలో మార్పులకు ఆమోదం తెలపనుంది.