CTR: జిల్లాలో ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ ఆదేశాల మేరకు ‘కరెంటోళ్ల జనబాట’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 298 సమస్యలు అధికారుల దృష్టికి వచ్చాయని ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. వీటిలో 11 కేవీ లైన్లు, ఎల్టీ లైన్లు మార్చడం, సర్వీసు లైన్లు తదితర సమస్యలు గుర్తించామని తెలిపారు. 29 తక్షణమే పరిష్కరించామన్నారు. 269 సమస్యలు పరష్కరిస్తామన్నారు